'అన్ని వివరాలు తెలుసుకున్నాకే మాట్లాడతా'- విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి ముమ్మర సమీక్ష!

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం రోజు దిల్లీలోని కర్తవ్య భవన్‌లో కేంద్ర విద్యాశాఖ అదనపు బాధ్యతల్ని అధికారికంగా స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన విద్యాశాఖలోని సీనియర్ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు, నిర్ణయాలు, కార్యకలాపాలపై విస్తృత సమీక్ష ప్రారంభించారు. శాఖ పనితీరును పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే కీలక నిర్ణయాలు, ఇంకా విధానాలపై మాట్లాడతానని తెలిపారు. శాఖలోని అన్ని అంశాల్ని సమీక్షిస్తున్నానని, సీనియర్ అధికారులతో ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనపై పూర్తి విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించారని...