బంగాళాఖాతంలో వాయుగుండం- ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని, దీంతో ఒడిశాలోని పలు జిల్లాలకు ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. జూన్ 30 నుంచి ఇప్పటివరకు వర్ష సంబంధిత ఘటనల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ...