ఫేస్‌బుక్‌లో ప్ర‌ధాని మోదీ వీడియో బ్లాక్‌..

కేంద్ర ప్ర‌భుత్వానికి మెటా సంస్థ క్ష‌మాప‌ణ‌లు(Meta Apology) చెప్పింది. ప్ర‌ధాని మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి డిలీట్ చేసిన అంశంలో ఆ సంస్థ వివ‌ర‌ణ ఇచ్చింది. టెక్నిక‌ల్ కార‌ణాల వ‌ల్ల ఆ వీడియోను తొల‌గించిన‌ట్లు మెటా సంస్థ అధికారుల‌తో పేర్కొన్న‌ది. అయితే తొంద‌ర‌పాటు ఆ వీడియోను తొల‌గించామ‌ని, కానీ మ‌ళ్లీ ఆ వీడియోను రిస్టోర్ చేసిన‌ట్లు మెటా సంస్థ ప్ర‌తినిధి ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అయితే ఫేస్‌బుక్ నుంచి మోదీ వీడియోను తొల‌గించ‌డం ప‌ట్ల ప్ర‌భుత్వం సిరీయ‌స్‌గా ఉన్న‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వార తెలుస్తోంది. మెటా ఇచ్చిన వివ‌ర‌ణ‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. వ‌రుసక్ర‌మ ఘ‌ట‌న‌ల‌పై ఫోక‌స్ పెట్టారు.