అదుపుత‌ప్పి ఇంటిపై ప‌డిన అమ‌ర్‌నాథ్ యాత్రికుల బ‌స్సు..

అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra) నుంచి తిరిగివస్తున్న యాత్రికుల బస్సు (Tourists Bus) ప్రమాదానికి గురైంది. ఓ మూల మ‌లుపు వ‌ద్ద అదుపుత‌ప్పి సింధు న‌ది (Sindhu River) గ‌ట్టున‌ ఉన్న ఇంటిపై ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 39 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir) లోని గాందర్‌బల్ జిల్లా (Ganderbal district) కంగన్ ప్రాంతం (Kangan Area) సమీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కంగన్‌ సమీపంలో రహదారిపై మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బ‌స్సు అదుపుత‌ప్పి ఇంటిపై ప‌డిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేక‌పోవ‌డంతో వారి ప్రాణాలు ద‌క్కాయి. బ‌స్సు ఇంటి మీద పడటంవల్లే...