అనిల్ రావిపూడి కోసం నిర్మాతల క్యూ..

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందువరుసలో ఉంటుంది. కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కుటుంబ కథలను జోడిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకోవడం ఆయన ప్రత్యేకత. తొలి సినిమా ‘పటాస్’ నుంచి తాజాగా విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వరకు వరుస విజయాలతో అనిల్ రావిపూడి తన విజయపరంపరను కొనసాగిస్తున్నారు.’ఎఫ్2′, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భగవంత్ కేసరి’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించడమే కాకుండా, కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. వినోదాన్ని ప్రధాన బలంగా చేసుకుని కమర్షియల్ సినిమాలను రూపొందించే దర్శకుడిగా అనిల్ రావిపూడి...