విదేశీయులే లక్ష్యంగా కోట్ల రూపాయల సైబర్ మోసం..

హైదరాబాద్ కేంద్రంగా నడిచిన అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ స్కామ్‌లో కీలక నిందితుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు(ఈడీ) అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి వికాస్ కుమార్ నిమార్ అలియాస్ మిస్టీ.. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల సైబర్ మోసానికి పాల్పడ్డాడు. దీంతో వికాస్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఫేక్ కాల్ సెంటర్‌కు సంబంధించి మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇంటర్‌పోల్ ద్వారా అమెరికా ఎంబసీ అందించిన సమాచారంతో సీబీఐ గతంలోనే కేసు నమోదు చేసింది. 2023లో ఈసీఐఆర్ నమోదు...