ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళ్ మిలన్ సమావేశం..
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ (మంగళవారం) పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ 'మంగళ్ మిలన్' సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ సభా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. ఈ సమావేశంలో ప్రధానంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు-2026' ఆమోదంపై వ్యూహాన్ని ఖరారు చేశారు. పేపర్ లీక్‌లు, మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టేందుకు ఈ బిల్లులో కఠిన నిబంధనలు ప్రతిపాదించారు. నేరస్థులకు గరిష్ఠంగా 10 ఏళ్ల...