విదేశాల్లో భారత బ్యాటర్ల వైఫల్యానికి బౌండరీలే కారణం

భారత జట్టు విదేశాల్లో వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న అంశంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా.. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో విధ్వంసం సృష్టించే బ్యాటర్లు.. విదేశీ పిచ్‌లపై తేలిపోతున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బౌండరీలే అసలు సమస్య అంటూ గావస్కర్ స్పష్టం చేశాడు. స్వదేశంలో మరో సీజన్ ప్రారంభానికి ముందే బౌండరీల పరిమాణాన్ని పెంచాలని బీసీసీఐకి గావస్కర్ సూచించాడు. ‘ఐపీఎల్‌లో బౌండరీలు దాటే మిస్‌హిట్ షాట్లు విదేశాల్లో పెద్ద బౌండరీల కారణంగా ఫీల్డర్ల చేతికి చిక్కుతున్నాయి. చాలా మైదానాల్లో ఎల్ఈడీ ప్రకటనల బోర్డుల వెనుక తగినంత స్థలం...