దుస్తుల్లోనే మూత్ర విసర్జన చేసిన ఐదేళ్ల బాలుడు.. ప్రైవేట్ పార్ట్స్‌పై వాతలు పెట్టిన టీచర్

యూపీ, వారణాసిలోని ఒక పాఠశాలలో దారుణం జరిగింది. క్లాస్‌రూమ్‌లోనే ఒక విద్యార్థి, దుస్తుల్లోనే మూత్రం పోయడంతో ఆగ్రహం చెందిన టీచర్.. ఆ బాలుడి మర్మాంగంపై వాతలు పెట్టారు. ఈ ఘటన ఈ నెల 24న వారణాసిలోని ఒక ప్రైవేటు స్కూల్‌లో జరిగింది. దీనిపై బాధిత విద్యార్థి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు పాఠశాలలో ఐదేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నాడు. అతడికి ఈ నెల 24న మూత్రం రావడంతో వాష్ రూమ్‌కు వెళ్తానని టీచర్‌ను అడిగాడు. కానీ, బాలుడు వాష్ రూమ్‌కు వెళ్లేందుకు టీచర్ నిరాకరించాడు. దీంతో కొద్దిసేపటి తర్వాత చిన్నారి బాలుడు దుస్తుల్లోనే, క్లాస్ రూమ్‌లో మూత్రం పోసుకున్నాడు....