దమ్మపేటలో వివాదాస్పద భూముల పరిశీలన

దమ్మపేట మండల కేంద్రం పరిధిలోని సర్వే నంబర్‌ 273/1 లో ఉన్న వివాదాస్పద భూములను మంగళవారం దమ్మపేట తాసీల్దార్ అండర్‌ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌) రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ భూములపై యాజమాన్య హక్కులకు సంబంధించి ఇటీవల జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి అందిన దరఖాస్తుల నేపథ్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఈ క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. వివాదాస్పద భూమిని పరిశీలించేందుకు అధికారులు వస్తున్నారన్న సమాచారంతో దమ్మపేట మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు విచారణ ప్రదేశానికి చేరుకున్నారు. దశాబ్దాలుగా ఈ భూములను గట్ల సర్వేశ్వరరావు, మల్లా కమల, జంగాల వెంకటేశ్వరరావు, సీనియర్‌ జర్నలిస్ట్ గోళ్ల‌ వెంకటేశ్వర్లు, గోళ్ల‌ సీతారావమ్మ, బొగ్గం...