440కి 434 మార్కులొస్తే నువ్వేమైనా గొప్పోడివా..
ఇంటర్ ఫస్టియర్‌లో 440కి 434 మార్కులొచ్చాయి.. అయినా సరే మెచ్చుకోవాల్సిన లెక్చరర్.. తనకంటే ఒక మార్కు ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థితో పోలుస్తూ తీవ్రంగా అవమానించింది. అందరిముందు చెంపదెబ్బకొట్టింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థ మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాల రూరల్ కొత్తపల్లికి చెందిన నేతిబొట్టు తరుణ్ (17) గద్వాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ సెకండియర్ చదువుతున్నాడు. ఫస్టియర్ ఫలితాల్లో జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచాడు. అయితే శనివారం నాడు తరుణ్‌ను మహిళా లెక్చరర్ తీవ్రంగా అవమానించింది. 435 మార్కులు వచ్చిన మొదటి ర్యాంకర్‌తో పోలుస్తూ...