ఎన్టీఆర్కు వరుస ఎదురుదెబ్బలు..
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గత కొన్ని వారాలుగా పలు కారణాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఒకవైపు కొత్త సినిమా ‘డ్రాగన్’ షూటింగ్ పదేపదే వాయిదా పడుతుండగా, మరోవైపు షూటింగ్ సమయంలో గాయపడటం, సోషల్ మీడియాలో చోటుచేసుకున్న వివాదాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అనేక కారణాలతో షూటింగ్కు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. గతంలో షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గాయపడటంతో కొన్ని రోజుల పాటు చిత్రీకరణ నిలిచిపోయింది. అనంతరం విదేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల...