ఆ పోస్టులు డిలీట్ చేసి, వారి డిటేల్స్ ఇవ్వండి..

రాజ్యాంగం ప్ర‌కారం ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్న వ్య‌క్తుల‌ను కించ‌ప‌రిచే రీతిలో, ప‌రువు న‌ష్టం క‌లిగించే రీతిలో ఉన్న కాంటెంట్‌ను తొల‌గించాల‌ని సోష‌ల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ సంస్థ‌ను ఇవాళ ఢిల్లీ పోలీసులు(Delhi Police) కోరారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ఆ సంస్థ‌కు లేఖ రాశారు. ఈ అంశంపై ఫిర్యాదు రావ‌డంతో పోలీసులు ఈ చ‌ర్య‌కు పూనుకున్నారు. ఉన్న‌త వ్య‌క్తుల‌ను టార్గెట్ చేస్తూ పోస్టు చేసిన వీడియోల‌ను, మెసేజ్‌ల‌ను త‌క్ష‌ణ‌మే డిలీట్ చేయాల‌ని కోరుతూ పోలీసులు త‌మ లేఖ‌ను ఎక్స్ సంస్థ‌ను కోరారు. అయితే ఎక్క‌డ నుంచి ఆ కాంటెంట్ అప్‌లోడ్ అయ్యింద‌న్న విష‌యానికి చెందిన పూర్తి రిజిస్ట్రీ వివ‌రాలు కావాల‌ని కూడా ఎక్స్ సంస్థ‌ను పోలీసులు...