చక్కెర ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం..!
చక్కెర ధరల (Sugar Price) ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం (Uniong Govt) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చక్కెర డీలర్లు 30 రోజులకు మించి స్టాకు నిలువ ఉంచరాదని, గరిష్ఠంగా నాలుగు వేల క్వింటాళ్ల వరకు మాత్రమే నిల్వ ఉంచాలని ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా ఇంతకుమించి నిల్వలు ఉంచడానికి వీల్లేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన లెక్కలను ప్రతిరోజూ ఫుడ్ స్టాక్ పోర్టల్ (Food Stock Portal) లో అప్‌డేట్ చేయాల్సిందేనని నిర్దేశించింది. ఆ ఆదేశాలు ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు అమలులో ఉంటాయి.