‘పెళ్లిచూపులు’కు పదేళ్లు.. విజయ్ దేవరకొండ కెరీర్‌ను మార్చేసిన కల్ట్ క్లాసిక్
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘పెళ్లిచూపులు’ విడుదలై నేటికి (జులై 29) పదేళ్లు పూర్తి చేసుకుంది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 2016లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దర్శకుడిగా తరుణ్ భాస్కర్ పరిచయమైన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు సమర్పణలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. సహజమైన కథనం, వినోదభరితమైన సంభాషణలు, కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, అప్పటి వరకు పెద్దగా గుర్తింపు...