భారత్‌, చైనాపై 100 శాతం సుంకాలు..

రష్యాపై మరింత కఠిన ఆర్థిక ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే, రష్యా నుంచి భారీగా చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభించనుంది (Russia Sanctions Bill). ఈ బిల్లును దివంగత సెనెటర్ లిండ్సే గ్రాహమ్, డెమోక్రటిక్ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంటాల్ కలిసి రూపొందించారు. సెనెట్‌లో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు 86-12 ఓట్లతో మద్దతు లభించింది. అయితే ఇది ఇంకా పూర్తిస్థాయి చట్టం కాలేదు. సెనెట్‌లో మరిన్ని దశలు పూర్తి చేసిన తర్వాత ప్రతినిధుల సభ...