బంగాళాఖాతంలో మునిగిన వాళ్లే హైడ్రాను ముంచుతామంటారా?’..
హైడ్రాపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామంటే అర్థం లేదంటూ సెటైర్ విసిరారు. వర్షాకాలం వచ్చినా ఇప్పటికీ 30 శాతం లోటు వర్ష పాతం నమోదైందని తెలిపారు. 150 ఏళ్ల నుంచి చూడని ప్రకృతి వైపరీత్యం వచ్చిందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో కూడా తీవ్ర ఎల్‌నినో ప్రభావం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రకృతి వైపరీత్యాన్ని గ్రామగ్రామాన ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నామన్నారు.