ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో విచిత్ర మోసం..
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో వెలుగు చూసిన ఓ విచిత్ర మోసం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్ సెకండ్ ఎలెవన్ జట్టుకు చెందిన ఓ ఫీల్డర్.. బంతి ప్రత్యర్థి బ్యాటర్ బ్యాట్‌కు తాకకపోయినా వేళ్లతో చిటికె వేసి శబ్దం సృష్టించాడు. నిజంగానే బ్యాట్‌కు బంతి తగిలిందని భ్రమపడిన అంపైర్లు బ్యాటర్లను క్యాచ్ ఔవుట్గా ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సాల్ట్‌బర్న్ క్లబ్ ఆటగాడు బ్రియాన్ డివైన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బ్రియాన్ డివైన్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ బంతి బ్యాట్‌ను దాటి వెళ్లే సమయంలో చిటికె వేస్తున్న దృశ్యాలు నెట్టింట...