మళ్లీ ఒకేసారి.. వచ్చేనెల రేషన్ దుకాణాల్లో మూడు నెలల బియ్యం పంపిణీ
రేషన్ లబ్ధిదారులకు మళ్లీ మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటా అందనుంది. ఎల్‌నినో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు కలిపి ఒకేసారి బియ్యం పంపిణీ చేయనున్నాయి. డీలర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ.. కార్డుదారుల సంఖ్యను తెలియజేస్తే నెలాఖరులోగా బియ్యం మొత్తాన్ని సరఫరా చేస్తామని తెలిపాయి.గ్రేటర్‌లోని హైదరాబాద్ జిల్లాలో 8,42,348, రంగారెడ్డిలో 6,72,909, మేడ్చల్‌లో 6,53,801 కార్డులున్నాయి. ఇందులో భాగంగా మూడు జిల్లాల్లో నెలకు సుమారు 39,75,0277 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. అలాగే చక్కెర, గోధుమలను కూడా అందజేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఒకసారి మూడు (ఏప్రిల్, మే, జూన్) నెలలకు...