తెలంగాణలో నేడు అతి భారీ వర్షాలు - రెడ్​ అలర్ట్​ జారీ చేసిన వాతావరణ శాఖ

వాయుగుండం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్​తో పాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ : ఉమ్మడి నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్​తో పాటు హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం...