చిలకలగూడలో కొత్త బస్​ టెర్మినల్​ - ఫ్రీ కానున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు!

హైదరాబాద్​లోని జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని రద్దీని తగ్గించేందుకు చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్, ఛార్జింగ్ స్టేషన్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీల మధ్య కుదిరిన ఉమ్మడి భూ బదిలీ ఒప్పందం ఆధారంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. రైల్వేకు ఆర్టీసీ భూమి : ప్రస్తుతం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 70కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తూ, రోజుకు 40,000 మందికి పైగా ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. అయితే స్టేషన్ ఆధునికీకరణకు తగినంత స్థలం అందుబాటులో లేదు. దీనివల్ల స్టేషన్‌కు ఆనుకుని ఉన్న 2.77 ఎకరాల స్థలాన్ని...