ఇక తెలంగాణలోనూ రివర్​ ర్యాఫ్టింగ్​, కయాకింగ్ గేమ్స్​ - వాటర్​ ఫాల్​ కారిడార్​ వచ్చేస్తోంది​!

రివర్‌ ర్యాఫ్టింగ్‌ అంటే హిమాచల్‌ప్రదేశ్‌, కయాకింగ్‌ అంటే కేరళ వంటి రాష్ట్రాలు మనకు గుర్తుకొస్తుంటాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ అలాంటి జల క్రీడలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని అందమైన జలపాతాలను ఒకే టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు తొలి సమగ్ర వాటర్‌ ఫాల్‌ టూరిజం కారిడార్‌ ప్లానింగ్ సిద్ధమైంది. కుంటాల, గాయత్రి, పొచ్చెర జలపాతాలతో పాటు ప్రాణహిత నది, మావల సరస్సు, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్, తిప్పేశ్వర్‌ అభయారణ్యాలనూ కనెక్ట్ చేయనున్నారు. రూ.7 కోట్ల ఆదాయం ఆర్జించేలా : గిరిజన సంస్కృతి, ప్రకృతి, సాహస, వన్యప్రాణి పర్యాటకాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం వాటర్ ​ఫాల్ టూరిజం కారిడార్ ప్రాజెక్టు ప్రత్యేకత. దేశంలోనే అత్యంత ప్రముఖమైన ఎకో టూరిజంగా...