తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ఈ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి

రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ పోలీస్ నియామక మండలి పోలీస్, ఎస్పీఎఫ్​, ఫైర్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు వివిధ విభాగాల్లో నియామకాలు చేపట్టనుండగా, దరఖాస్తు తేదీలను త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి కొలువుల సందడి మొదలైంది. 7,437 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) బుధవారం రాత్రి నోటిఫికేషన్లు జారీ...