అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీల వద్ద నిరుద్యోగుల మెరుపు ధ‌ర్నా..

అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్ ప్రకటిస్తాం.. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ గద్దెనెక్కిన రేవంత్ సర్కార్‌ హామీలను నెరవేర్చకుండా తమ పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి కేవలం అతి తక్కువ పోస్టులతో పోలీస్‌ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు. తాజాగా అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీల వద్ద నిరుద్యోగులు మెరుపు ధ‌ర్నా చేపట్టారు. 7437 పోస్టులు కాదు.. 19000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆందోళనలో పాల్గొన్న నిరుద్యోగులు ఎస్సై, కానిస్టేబుల్ వయో పరిమితి సడలింపు...