బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా..

బీజేపీ కీలక నేత, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా బీజేపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన తన రాజీనామా సమర్పించినట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వానికి తన రాజీనామా లేఖ అందజేశారు. షెహజాద్ పూనావాలా బీజేపీకి అధికార ప్రతినిధిగా ఉంటూ, టీవీ చర్చల్లో ఆ పార్టీ తరఫున గళం వినిపిస్తుంటారు. అనేక రాజకీయ అంశాల్లో బీజేపీని, మోదీని సమర్ధిస్తూ పార్టీకి అండగా నిలిచారు. ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన రాజకీయ విషయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు. 18, 19 ఏళ్లుగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. ఇన్నేళ్లుగా తాను అనుకున్నది సాధించానని కూడా...