ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో మోదీపై అభ్యంత‌ర‌క‌ర కాంటెంట్‌..

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు వాటి పేరెంట్ కంపెనీ మెటా సంస్థ‌పై హైద‌రాబాద్‌లో కేసు న‌మోదు అయ్యింది. నీట్ పేప‌ర్ లీకేజీని నిర‌సిస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ధ‌ర్నా చేసిన స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ(PM Modi)ని టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మార్ఫింగ్ వీడియోల‌ను పోస్టు చేశారు. అయితే ఆ ఎఫ్‌బీ, ఇన్‌స్టా అకౌంట్ల‌పై సైబ‌ర్‌క్రైం పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో వివ‌రాలు ఇలా ఉన్నాయి. జూలై 29వ తేదీన టీ సాయికిర‌ణ్ గౌడ్ అనే వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర బీజేపీ సోష‌ల్‌ మీడియా సీసీ స‌భ్యుడిగా ఉన్నాడ‌త‌ను. నాంప‌ల్లిలోని ఎగ్జిబిష‌న్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న డాక్ట‌ర్ ఎస్పీ ముఖ‌ర్జీ భ‌వ‌న్‌లో అత‌ను...