యువతపై బీజేపీ ఫోకస్..

నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున రాజకీయ చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన కమ్యూనికేషన్ వ్యూహాన్ని మార్చుకునేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా జెన్-జీ యువతతో నేరుగా అనుసంధానం కావడానికి కొత్త సోషల్ మీడియా వేదికలను వినియోగించే దిశగా పార్టీ అడుగులు వేస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ప్రధానంగా ఏకపక్ష సందేశాలకే పరిమితమైన ప్రచార విధానానికి బదులుగా.. ఇకపై యువతతో ద్విముఖ సంభాషణ (Two-way Communication)కు ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. యువతతో తమ పార్టీకి ఉన్న కమ్యూనికేషన్ లోటును జెన్-జీ ఉద్యమం స్పష్టంగా బయటపెట్టిందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత తరం...