చంద్రబాబు దార్శనికత వల్లే ఏలేరు ఆయకట్టుకు సాగునీరు
ఏలేరు ఆయకట్టుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకమే వరమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈరోజు(శుక్రవారం) పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని ఏలేరు పరివాహక ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదావరి వరద జులైలోనే 6 వేల క్యూసెక్కులకు పడిపోయిందని.. ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అనిశ్చిత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులంతా విధిగా పంటల బీమా చేయించుకోవాలని తెలిపారు. అనుమతుల కోసం వేచి చూడకుండా ఏలేరు, పిఠాపురం కాలువల్లో తక్షణమే పూడికతీత పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.