మైక్రోసాఫ్ట్ ఆల్‌టైమ్ రికార్డ్..
అమెరికా మార్కెట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఏకంగా ఒక్క రోజులోనే తన మార్కెట్ విలువకు దాదాపు 450 బిలియన్ డాలర్లు (సుమారు రూ.39 లక్షల కోట్లు) పెంచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ చరిత్రలో ఏ ఒక్క నమోదిత కంపెనీ కూడా ఒక్క రోజు ఈ స్థాయిలో మార్కెట్ విలువను పెంచుకోలేదు. ఈ సంచలన ర్యాలీతో మైక్రోసాఫ్ట్.. ప్రముఖ ఏఐ (AI) చిప్‌మేకర్ 'ఎన్విడియా' (Nvidia)ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా మళ్లీ తన స్థానాన్ని కైవసం చేసుకుంది.