మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశాక నిద్ర మ‌త్తు ఎక్కువ‌గా వ‌స్తుంటే ఇలా చేయండి..

మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే చాలామందికి నిద్రమత్తు, బద్ద‌కం రావడం సహజం. ముఖ్యంగా కార్యాలయాల్లో పనిచేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. భోజనం చేసిన తర్వాత పనిపై ఏకాగ్రత తగ్గడం, ఉత్సాహం తగ్గిపోవడం వల్ల పనితీరు కూడా దెబ్బతింటుంది. అయితే కొన్ని సులభమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులతో ఈ సమస్యను చాలావరకు నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న భోజనం ఎక్కువగా తిన్నప్పుడు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు ప్యాంక్రియాస్‌ అధికంగా ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇన్సులిన్‌ పెరగడంతో మెదడులో సెరోటోనిన్‌, మెలటోనిన్‌ వంటి నిద్రను ప్రేరేపించే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో శరీరం మందగించి నిద్రమత్తు ఎక్కువగా అనిపిస్తుంది. 5 లేదా 10...