ఒత్తిడి తీవ్రంగా ఉన్నవారు ఈ సూచనలు పాటిస్తే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు..
నేటి వేగవంతమైన జీవనశైలిలో వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతుల్యత పాటించడం చాలామందికి సవాలుగా మారింది. ఈ ఒత్తిడి (స్ట్రెస్) రోజువారీ జీవితంపై మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. స్ట్రెస్‌ను నిర్లక్ష్యం చేస్తే రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, డిప్రెషన్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఒత్తిడిని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సైక్లింగ్ ఒక అద్భుతమైన ఎరోబిక్ వ్యాయామం. ఇది బరువు తగ్గడంలోనే కాకుండా ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల మెదడులో సెరొటోనిన్, డోపమైన్,...