సినీ ఇండ‌స్ట్రీలో విషాదం..

హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు విన్సెంట్ పాస్టోర్ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. హెచ్‌బీఓ రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాత క్రైమ్ డ్రామా సిరీస్ ది సోప్రానోస్ లో సాల్వటోర్ ‘బిగ్ పసీ’ బోన్పెన్సియెరో పాత్రతో ఆయన అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆయన మరణవార్త అభిమానులతో పాటు హాలీవుడ్ సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజా సమాచారం ప్రకారం, విన్సెంట్ పాస్టోర్ తన బ్రాంక్స్ నివాసంలో మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని రోజులుగా ఆయన కనిపించకపోవడంతో పొరుగువారు అధికారులకు సమాచారం ఇవ్వగా, అనంతరం ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మరణానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టగా,...