క్యాన్సర్‌ను అడ్డుకుంటున్న ‘వయాగ్రా’!

పురుషుల్లో అంగస్తంభన సమస్యకు వాడే ‘వయాగ్రా’ (సిల్డెనాఫిల్‌) క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని, కణితుల పెరుగుదలను అడ్డుకుంటున్నదని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘వీజ్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’ పరిశోధకుల అధ్యయనంలో వయాగ్రా క్యాన్సర్‌ వ్యాప్తిని నెమ్మదింపజేయటంలో సహాయపడుతుందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లభించాయి.