‘రామాయణ’ ట్రైలర్‌కు అశేష స్పందన..
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం రామాయణపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ విజువల్ ఎపిక్ కోసం భారతీయ సినీ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు వచ్చిన అద్భుత స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, రామాయణ ట్రైలర్ కేవలం నాలుగు రోజుల్లోనే 800 మిలియన్ వ్యూస్‌ను నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యూస్ కేవలం యూట్యూబ్‌లో వచ్చినవి మాత్రమే కాకుండా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్), ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నమోదైన మొత్తం వ్యూస్‌గా సినీ వర్గాలు...