‘భ‌ట్టి గారు.. ఉట్టి మాటలు కట్టిపెట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి’

కోదాడ‌, ఆగ‌స్టు 04 : ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన, అందాల పోటీలు, ఫుట్‌బాల్ మ్యాచ్‌ల‌కు లక్షల కోట్ల నిధులు ఉంటాయి కానీ ఉద్యోగస్తుల పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుకు, పాత పెన్షన్ విధానం అమలుకు నిధులు లేకపోవడం విచారకరమని, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఉట్టి మాటలు కట్టిపెట్టి ఉద్యోగుల ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాటం చేసిన ఉద్యోగులు నేడు తమ హక్కుల కోసం రోడ్డు ఎక్కడం బాధాకరమన్నారు....