ఆహారకల్తీ ముఠాలపై కూంబింగ్‌లా ఆపరేషన్స్​ చేస్తాం : డీజీపీ సీవీ ఆనంద్

రాత్రి వేళల్లో పోలీసులు తమ పరిధిలో ఎలాంటి నేరాలు జరగకుండా చూడగలిగితే విజయం సాధించినట్లేనని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. టెక్నాలజీని ఎంత వాడుతున్నా బేసిక్ పోలీసింగ్​ను ఎట్టి పరిస్థితుల్లో మరువకూడదని అధికారులకు, సిబ్బందికి నిత్యం సూచిస్తున్నట్లు తెలిపారు. సాధారణ నేరాల్లో కోల్పోయే నగదు కంటే సైబర్ నేరాల్లో ఎక్కువ మొత్తంలో అమాయక ప్రజలు నష్టపోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈటీవీ భారత్ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. చిన్నారులకు చాకెట్ల రూపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఘటనలపై ఆవేదన వ్యక్తం చేసిన డీజీపీ మత్తు మహమ్మరిని కూకటి వేళ్లతో పెకలించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోవడంతో కేంద్ర...