కాఫీ తాగిన వెంటనే ఉత్సాహంగా అనిపిస్తుంది, ఎందుకని.. దీని వల్ల శక్తి లభిస్తుందా..?
కాఫీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తాగే పానీయాల్లో ఒకటి. ముఖ్యంగా అలసటగా అనిపించినప్పుడు లేదా పనిలో ఏకాగ్రత తగ్గినప్పుడు చాలా మంది వెంటనే ఒక కప్పు కాఫీ తాగుతారు. కాఫీ తాగిన కొద్దిసేపటికే శరీరంలో ఉత్సాహం పెరిగినట్లు అనిపిస్తుంది. అయితే నిజంగా కాఫీ శరీరానికి శక్తిని ఇస్తుందా? లేక అది కేవలం కొంతసేపు మాత్రమే చురుకుదనాన్ని కలిగిస్తుందా? దీనిపై నిపుణులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత చాలా మందికి అలసట, నిద్రమత్తు వస్తుంది. అలాంటి సమయంలో ఒక కప్పు కాఫీ తాగితే వెంటనే మళ్లీ చురుకుగా అనిపిస్తుంది. దీంతో కాఫీ శరీరానికి శక్తిని అందిస్తుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి కాఫీ శరీరంలో...