సునేత్ర పవార్‌ను కలిసిన ప్రశాంత్ కిషోర్..
బీహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడించిన జేఎస్పీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత్రి సునేత్రా పవార్‌ను కలిశారు. ముంబైలోని ఆమె నివాసంలో వారిద్దరూ సమావేశమయ్యారు. (Sunetra Meets Prashant) అయితే రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్, సునేత్రా పవార్‌ను కలుసుకోవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆమె భర్త, నాటి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన తర్వాత వారిద్దరూ సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది. కొన్ని నెలల క్రితం జరిగిన మొదటి భేటీపై సునేత్రా కుమారుడు, ఎన్సీపీ నేత పార్థ్ పవార్ వివరణ...