కొరియన్ కనకరాజు రివ్యూ: వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
| భయపెట్టడం, అంతలోనే నవ్వించడం, లాజిక్‌ను పక్కన పెట్టి మ్యాజిక్ చేసే వెసులుబాటు హారర్ కామెడీ జానర్‌కు ఉంటుంది. వరుణ్ తేజ్ తన కెరీర్‌లో తొలిసారి ‘కొరియన్ కనకరాజు’ తో ఈ జానర్‌ను టచ్ చేశాడు. రాయలసీమ యువకుడి శరీరంలో కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ప్రవేశిస్తే ఏమవుతుంది? అనే ఐడియాతో దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ కథను తీర్చిదిద్దాడు. మరి ఈ కొరియన్ ఆత్మ కథ ఎలాంటి నవ్వులు పంచింది? ఎంతలా భయపెట్టింది? రివ్యూలో చూద్దాం. కథ: అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) చెక్కభజన ప్రదర్శనలు చేస్తూ సరదాగా గడిపేస్తుంటాడు. కియా ఫ్యాక్టరీలో పనిచేసే చైత్ర (రితికా నాయక్)ను ప్రేమిస్తాడు. ఇదే...