ఏఎస్ఐగా ఓ మ‌హిళ న‌కిలీ అవ‌తారం..

పంజాబ్ పోలీసులు ఓ న‌కిలీ మ‌హిళా ఏఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. రెండు నెల‌ల పాటు ఆమె పోలీసు దుస్తుల్లో హ‌ల్‌చ‌ల్ చేసింది. ఫిరోజ్‌పూర్‌లో ఆమెను మోఘా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. నిందిత వ్య‌క్తిని కోమ‌ల్‌ప్రీత్ కౌర్‌గా గుర్తించారు. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని మాలేవాలా గ్రామం ఆమెది. త‌న‌కు తాను ఓ పోలీసులా ఆమె గెట‌ప్ వేసుకున్న‌ది. సామాజికంగా గుర్తింపు పొందేందుకు పోలీసు శాఖ‌లో ఏఎస్ఐగా చేస్తున్న‌ట్లు చెప్పుకున్న‌ది. అయితే ఓ మంచి కుటుంబం నుంచి అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు ఆమె పోలీసు వేషం వేసిన‌ట్లు తెలిసింది. నెల క్రితం ఓ వ్య‌క్తిని కూడా ఆమె పెళ్లాడింది. త‌ప్పుడు గుర్తింపుతోనే ఆ పెళ్లి చేసుకున్న‌ది.అయితే...