పీఎఫ్ విత్ డ్రా నిబంధనల్లో కొత్త మార్పులు

ఈపీఎఫ్ ఖాతాదారులకు పీఎఫ్ విత్‌డ్రా నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. గతంలో 13 రకాల కారణాలకు పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు వాటిని కేవలం 3 కారణాలకు (ఆరోగ్యం, చదువు/పెళ్లి, ఇల్లు) కుదించారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో అర్హతగల మొత్తంలో 100% విత్‌డ్రా చేసుకోవచ్చు. జీవితకాలంలో చదువుకు 10 సార్లు, పెళ్లికి 5 సార్లు, ఇంటి అవసరాలకు 5 సార్లు విత్‌డ్రా చేసుకునే పరిమితులు విధించారు. ఉద్యోగం మానేసిన వెంటనే 75% విత్‌డ్రా చేసుకోవచ్చు, మిగిలిన 25% ని 12 నెలల తర్వాత పొందే అవకాశం ఉంటుంది.