బంధువుకు బెయిల్ రావాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫొటోతో క్షుద్రపూజ..
చత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన జరిగింది. తమ బంధువుకు బెయిల్ రావాలని కోరుకుంటూ నిందితుడి తరఫు వాళ్లు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫొటోతో క్షుద్రపూజ నిర్వహించారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్, బిలాస్‌పూర్ జిల్లా, సిపాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్రి గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి. కొద్దిరోజుల క్రితం స్థానికంగా ఉండే ప్రియాన్షు బోలెతోపాటు మరికొందరు కలిసి ఒక వ్యక్తిపై దాడి చేశారు. కత్తితో పొడిచారు. ఈ కేసులో ప్రియాన్షు బోలె, ఇతర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.వీరిలో కొందరికి బెయిల్ లభించింది. బోలెతోపాటు మిగతా నిందితుల బెయిల్ పిటిషన్ చత్తీస్‌గఢ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో నిందితులకు...