ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కోతి పుర్రె క‌ల‌క‌లం..

ఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ కు విమానంలో బయలుదేరిన ఒక ప్రయాణికుడి బ్యాగేజీలో జంతువు పుర్రె లభించడం తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 10న విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది సాధారణ భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన ఒక ప్రయాణికుడి బ్యాగును స్కానింగ్ చేయగా.. అందులో అనుమానాస్పద వస్తువులు క‌నిపించాయి.బ్యాగును తెరిచి పరిశీలించగా లోపల ఒక పుర్రె, ఒక మంత్ర దండం వంటి వస్తువులు కనిపించాయి. దీనిపై సిబ్బంది ప్రయాణికుడిని ప్రశ్నించగా అది...