ఆసియా కప్ నుంచి జెమీమా ఔట్..

భారత మహిళల క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆసియా క్రీడలు, ఆసియా కప్ వంటి మెగా టోర్నీలకు జెమీమా రోడ్రిగ్స్దూరమైంది. టీమిండియా తొలి వరల్డ్‌కప్ విజయంలో కీలకమైన జెమీమా తొడ కండరాల గాయం కారణంగా ఈ రెండు ఈవెంట్లకు అందుబాటులో ఉండడం లేదని శుక్రవారం బీసీసీఐ వెల్లడించింది. ఈ మిడిలార్డర్‌ బ్యాటర్ స్థానంలో వరల్డ్‌కప్ ఓపెనర్ ప్రతీకా రావల్‌ను ఏసీసీ ఆసియా కప్ కోసం ఎంపిక చేశారు సెలెక్టర్లు.