‘బేవకూఫ్.. వినలే’ అంటూ జర్నలిస్టుపై నోరుపారేకున్న బీజేపీ ఎంపీ..!

బీజేపీ ఎంపీ అర్వింద్‌‌ కుమార్‌ ‌జర్నలిస్టుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ స్థాయిలో ఉన్న అర్వింద్ జర్నలిస్ట్‌పై అనవసరంగా నోరు పారేసుకోవడడాన్ని తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ‌తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని టీబ్ల్యూజేఎఫ్‌ నిరసన వ్యక్తం చేసింది.హైదరాబాద్‌‌లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ప్రెస్‌‌మీట్‌‌లో ఎంపీ అర్వింద్‌ మాట్లాడారు. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్ ఎంపీని ప్రశ్నించారు. అంతే.. ఒక్కసారిగా కోపిష్టిగా మారిన అర్వింద్. ‘ఇప్పటిదాకా చెప్పిన కదా బేవకూఫ్‌.. వినలే’ అంటూ పరుషంగా మాట్లాడారు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి జర్నలిస్ట్‌ను అలా అమర్యాదగా మాట్లాడడం సిగ్గుచేటని టీబ్ల్యూజేఎఫ్ వ్యాఖ్యానించింది.