ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ నిజంగానే శరీరానికి మేలు చేస్తాయా..
ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ప్రస్తుతం స్పోర్ట్స్ ఆడే వారు మాత్రమే కాకుండా సాధారణ ప్రజల్లోనూ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. శరీరానికి ఎక్కువ హైడ్రేషన్ అందిస్తాయని భావించి చాలామంది వీటిని రోజువారీ పానీయాలుగా తీసుకుంటున్నారు. అయితే ప్రతి రోజూ ఎలక్ట్రోలైట్ డ్రింక్ తాగాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. శరీరం నుంచి నీటితోపాటు ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా కోల్పోయే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లు శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. ఇవి శరీరంలోని ద్రవ సమతుల్యతను నియంత్రించడంతోపాటు నరాల సంకేతాలు, కండరాల పనితీరు, గుండె పనితీరుకు అవసరమవుతాయి. నీటితోపాటు ఈ ఖనిజాలు సరైన నిష్పత్తిలో ఉండటం...