స్నేహితుడి నంబర్‌తో మెసేజ్.. ఓపెన్ చేయగానే రూ.4.15 లక్షలు మాయం
జగిత్యాల, ఆగస్టు 15: జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపుతోంది. స్నేహితుడి నంబర్‌తో వచ్చిన ఓ మెసేజ్‌ను ఓపెన్ చేసిన వెంటనే దాదాపు నాలుగు లక్షల నగదు మాయమవడం సంచలనం సృష్టిస్తోంది. అశోక్ అనే వ్యక్తి వాట్సాప్‌కు APK ఈ-చలాన్ మెసేజ్ వచ్చింది. స్నేహితుడి నంబర్ నుంచి రావడంతో ఆ లింక్‌ను ఓపెన్ చేశాడు బాధితుడు. ఆ వెంటనే అతడి బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. రెండుసార్లు దాదాపు రూ.4.15 లక్షలను కేటుగాళ్లు దోచేశారు. ఒకసారి రూ.3.99 లక్షలు, మరోసారి రూ.15వేల చొప్పున సైబర్ నేరగాళ్లు కాజేశారు. లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఖాతా నుంచి డబ్బులు మాయమవడంతో బాధితుడు షాక్‌కు గురయ్యాడు....