ఒక్కసారిగా ఇంజిన్ ఫెయిల్.. గాల్లోనే వణికిపోయిన 220 మంది!
గోవా నుంచి ఢిల్లీకి 220 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఇండిగో విమానంలో గాల్లో ఉండగానే ఇంజిన్ విఫలమైంది.వెంటనే అప్రమత్తమైన పైలట్లు ATCకి సమాచారం ఇచ్చి, విమానాన్ని తిరిగి గోవాకు మళ్లించారు. అత్యవసరంగా ల్యాండింగ్ ఏర్పాట్లు చేసి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.