Nepal floods: 1000కు పైగా పెరిగిన మృతులు.. ఇంకా వేల మంది ఆచూకీ గల్లంతు..
నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకూ 1000 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. సెప్టెంబర్ 1 నాటికి 1,003 కు పైగా మృత దేహాలు లభ్యం అయినట్లు అధికారులు వెల్లడించారు.దాదాపు 4 వేల మందికి పైగా గల్లంతైనట్లు తెలిపారు. వరదల ధాటికి ఎనిమిది జిల్లాల్లోనే అధిక సంఖ్యలో తవ్వే కొద్దీ మృతదేహాలు లభ్యం అవుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇప్పటివరకూ 12 వేల మందికిపైగా ప్రజల్ని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్ మెంట్ అథారిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.నేపాల్- టిబెట్ సరిహద్దులో భోటేకోశీ నది ఉప్పొంగి వరదలు సంభవించిన సంగతి తెలిసిందే....