వినాయకుని రూపంలో సైబర్ సెక్యూరిటీ పాఠాలు!
వినాయక చవితి సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రూపొందించిన సైబర్ భద్రత అవగాహన పోస్టర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ బుధవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఆవిష్కరించారు.‘వినాయకుడి నుంచి సైబర్ భద్రత పాఠాలు’ అనే సందేశంతో రూపొందించిన ఈ పోస్టర్‌లో సైబర్ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించారు. వినాయకుడి పెద్ద చెవులు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినాలని, చిన్న కళ్లతో నిశితంగా గమనించాలని, పెద్ద తలతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నట్లుగా పోస్టర్ ద్వారా అవగాహన కల్పించారు.సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. మోసం...